హరిద్వార్ మానసా దేవి ఆలయంలో తొక్కిసలాట.. ఆరుగురు మృతి..

హరిద్వార్ మానసా దేవి ఆలయంలో తొక్కిసలాట.. ఆరుగురు మృతి..

ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో ఘోరం జరిగింది.. ఆదివారం ( జులై 27 ) హరిద్వార్ లోని మానసా దేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... శ్రావణమాసం కావడంతో ఆదివారం పెద్ద ఎత్తున యాత్రికులు ఆలయానికి పోటెత్తారు. భారీగా చేరుకున్న యాత్రికులు క్యూలైన్లలో బారులు తీరారు. ఈ క్రమంలో తోపులాట చోటు చేసుకోవడంతో పలువురు భక్తులు గాయపడినట్లు తెలుస్తోంది.

ఘటనపై సమాచారం అందుకున్న ఎమర్జెన్సీ బృందాలు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. చికిత్స పొందుతూ ఆరుగురు మృతి చెందగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి  ఉంది.

ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఎక్స్ వేదికగా స్పందించారు. ఎస్డీఆర్ఎఫ్, స్థానిక పోలీసులు, ఇతర సహాయక బృందాలు ఘటనాస్థలం దగ్గర సహాయక చర్యలు చపట్టాయని... స్థానిక యంత్రాంగంతో ఎప్పటికప్పుడు మాట్లాడి పరిస్థితిని సమీక్షిస్తున్నామని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు పుష్కర్ సింగ్ ధామి.