
హిమాచల్‌ప్రదేశ్‌లోని కులులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టూరిస్ట్‌లతో వెళ్తున్న టెంపో ట్రావెలర్ వెహికల్‌అదుపు తప్పి లోయలో పడింది. బంజర్ సబ్‌డివిజన్‌లోని ఘియాఘి సమీపంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బాధితులంతా హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లకు చెందిన వారని అధికారులు తెలిపారు.
కులులోని బంజర్ వ్యాలీలోని ఘియాగి ప్రాంతంలో ఆదివారం రాత్రి 8:30 గంటలకు పర్యాటక వాహనం కొండపై నుంచి బోల్తా పడిందని ఎస్పీ గురుదేవ్ సింగ్ తెలిపారు. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, మరో 10 మంది గాయపడ్డారని వెల్లడించారు. గాయపడిన ఐదుగురిని కులు జోనల్ ఆసుపత్రికి తరలించామని, వారు బంజర్‌లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు.