టెహ్రాన్: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హత్యకు గురై ఏడు వారాలు గడుస్తున్నా ఆయన అంత్యక్రియలపై ప్రభుత్వం ఇంకా ఎటూ తేల్చుకోలేకపోతోంది. భద్రతా కారణాలు, యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఖమేనీ అంత్యక్రియలకు తీవ్ర జాప్యం జరుగుతోందని సమాచారం.
ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన వైమానిక దాడిలో ఖమేనీ మరణించారు. సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరగాల్సి ఉన్నా ఇరాన్ అధికార యంత్రాంగం మాత్రం వెనుకడుగు వేస్తోంది. అంత్యక్రియలకు జనం భారీగా హాజరవుతారని, ఆ సమయంలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసే చాన్స్ ఉందని ఆందోళన చెందుతోంది.

