కస్టమర్ రైడ్స్ ను క్యాన్సిల్ చేసి.. రూ.23 లక్షలు సంపాదించిన 70 ఏళ్ల ఉబెర్ డ్రైవర్

కస్టమర్ రైడ్స్ ను క్యాన్సిల్ చేసి.. రూ.23 లక్షలు సంపాదించిన 70 ఏళ్ల ఉబెర్ డ్రైవర్

కస్టమర్ రైడ్‌లను రద్దు చేయడం ద్వారా డబ్బు సంపాదించినట్లు ఉబెర్ డ్రైవర్ తెలిపాడు. ఇది మాత్రమే కాదు, అతను 10 శాతం కంటే తక్కువ రిక్వెస్ట్ లను మాత్రమే ఒకే చేసి, 30 శాతానికి పైగా రైడ్‌లను రద్దు చేశాడు. ఉబెర్ డ్రైవర్‌గా మారాలనుకున్న 70 ఏళ్ల వ్యక్తి.. తద్వారా అతను పదవీ విరమణ తర్వాత కొంత అదనపు డబ్బు సంపాదించాడు.

అతను తన సమయానికి విలువైనదిగా భావించిన రిక్వెస్ట్ లను మాత్రమే స్వీకరించేవాడు. ఈ పని పద్ధతి అతనికి ఫలవంతంగా మారింది. 2022లో ఈ వ్యక్తి దాదాపు 15 వందల ట్రిప్పులను రద్దు చేసి రూరూ. 23 లక్షకు  పైగా సంపాదించాడు. అతను నివసించే, చుట్టు పక్కల కామన్ గా వచ్చే రైడ్స్ తక్కువగా ఉండడంతో, అతను క్రమేణా తన రైడింగ్ సమయాన్ని కూడా తగ్గించేశాడు. వారానికి 40 గంటలు పని చేసే అతను.. వారానికి 30 గంటలకు వచ్చాడు.

“నేను చాలా మందికి చెప్పిన మాట నో అనే. ఎందుకంటే నాకు అవసరం ఉంటే తప్ప నేను పని చేయను" అని ఆ వ్యక్తి చెప్పాడు. శుక్ర, శనివారాల్లో ఉదయం 10:00 నుండి తెల్లవారుజామున 2:30 గంటల మధ్య బార్‌లు, విమానాశ్రయాల వంటి రద్దీగా ఉండే ప్రదేశాలలో ఈ డ్రైవర్ తన వాహనాన్ని ఉంచేవాడు. అప్పుడు, అతను "వన్-వే రైడ్‌లను" వదిలేసేవాడు. ఒక సంఘటనను గుర్తుచేసుకుంటూ, అతను ఒకసారి తన నగరం నుండి సుమారు రెండు గంటలపాటు ఒక కస్టమర్‌ను తీసుకెళ్ళి చేసి రూ.2,246డబ్బు తీసుకున్నట్లు చెప్పాడు.“నేను బయటకు వెళ్లడానికి డ్రైవ్ చేస్తున్నాను. నేను చేసే పనికి డబ్బు అవసరం లేదు. ఐ లవ్ ఇట్”అని ఈ సందర్భంగా ఆ వ్యక్తి అన్నాడు