రామ్‌‌లల్లాకు 7 వేల కిలోల హల్వా

రామ్‌‌లల్లాకు 7 వేల కిలోల హల్వా

న్యూఢిల్లీ: అయోధ్యలోని రామాలయ మహాసంప్రోక్షణ మహోత్సవం త్వరలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో నాగ్‌‌పూర్‌‌‌‌ చెఫ్‌‌ విష్ణు మనోహర్‌‌‌‌ అయోధ్యలో 7 వేల కిలోల ‘రామ్‌‌ హల్వా’ ను సిద్ధం చేయనున్నారు. రామ మందిరం ఆవరణలో జరిగే ఈ కార్యక్రమానికి విష్ణు మనోహర్‌‌‌‌ 12 వేల లీటర్ల సామర్థ్యంతో ప్రత్యేక కడాయి తయారుచేయించారు.

కడాయి చుట్టూ ఉక్కుతో, మధ్య భాగం ఇనుముతో తయారు చేశారు. ఇందులో మొత్తం 7 వేల కిలోల హల్వా తయారు చేయొచ్చని విష్ణు మనోహర్‌‌‌‌ చెప్పారు. ఈ హల్వా తయారీకి 900 కిలోల రవ్వ, 1,000 కిలోల నెయ్యి, 1,000 కిలోల చెక్కర, 2 వేల లీటర్ల పాలు, 2,500 లీటర్ల నీరు. 300 కిలోల డ్రై ఫ్రూట్స్‌‌, 75 కిలోల యాలకుల పొడిని ఉపయోగించనున్నారు. రామ్‌‌లల్లాకు ఈ ప్రసాదాన్ని సమర్పించిన తర్వాత సుమారు లక్షన్నర మందికి దీన్ని పంచనున్నారు.