
పంజాగుట్ట, వెలుగు: బేగంపేటలోని మహాత్మ జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణికి 702 ఫిర్యాదులు అందాయి. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించినవి 219, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్అండ్అర్బన్ డెవలప్మెంట్ విభాగానికి సంబంధించినవి 54, పోలీస్‌శాఖకు 52, ఇండ్ల కోసం 44, పౌర సరఫరా శాఖకు సంబంధించినవి 46తోపాటు ఇతర విభాగాలకు చెందినవి 287 ఉన్నాయి. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి పర్యవేక్షణలో నోడల్ఆఫీసర్ దివ్య దేవరాజన్ఫిర్యాదులను తీసుకున్నారు..
ప్రజావాణి కార్యక్రమాన్ని మంత్రి సీతక్క పరిశీలించారు. పలువురితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. గ్రేటర్హైదరాబాద్డ్రైవర్ కమ్ ఓనర్ అసోసియేషన్సభ్యులు తమ సమస్యలను మంత్రికి వివరించారు. పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలకు అనుగుణగా ప్యాకేజీని పెంచాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన 5 ఎకరాల భూమిని కొందరు కబ్జా చేశారని నిజామాబాద్‌కు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు ముత్యాల వీరప్ప కుమారుడు ప్రకాశ్(83)ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అధికారులు విచారణ జరిపి తన భూమిని తనకు ఇప్పించాలని కోరారు.
మేడ్చల్‌జిల్లా కీసర మండలం నాగారంలోని బాలాజీ ఎన్‌క్లేవ్‌లో ఉన్న 40 అడుగుల రోడ్డుకు అడ్డంగా పాపిరెడ్డి అనే వ్యక్తి గోడ నిర్మించాడని స్థానికులు ఆరోపించారు. ఐదు కాలనీలకు ఇదే ప్రధాన రహదారి అని చెప్పారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. వివిధ కారణాలతో సర్వీస్‌నుంచి తొలగించిన తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ మాజీ ఆర్టీసీ ఉద్యోగులు ప్రజాభవన్ ఆవరణలో బైఠాయించారు. మంత్రి సీతక్కను కలిసి వేడుకున్నారు.