
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో 49 వైన్ షాపులకుగాను గురువారం వరకు 71 అప్లికేషన్లు వచ్చాయి. కామారెడ్డి పరిధిలో 18, దోమకొండ పరిధిలో 10, ఎల్లారెడ్డి పరిధిలో 4, బాన్సువాడ పరిధిలో 16, బిచ్కుంద పరిధిలో 23 అప్లికేషన్లు వచ్చినట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ బి. హనుమంతరావు తెలిపారు.
ఈ నెల 11న రెండో శనివారం కూడా అప్లికేషన్లు తీసుకుంటామని పేర్కొన్నారు. ఒకరు ఎన్ని అప్లికేషన్లు అయినా వేయవచ్చని, ప్రభుత్వ ఆదాయానికి గండి పడేలా సిండికేట్గా ఏర్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.