రెండు గ్రహాలు.. మూడు కాలాలు

రెండు గ్రహాలు.. మూడు కాలాలు

సాహస్, దీపికా ప్రధానపాత్రల్లో చైతు మాదాల దర్శకత్వంలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్  ‘7:11 పి.ఎం’. నరేన్ యనమదల, మాధురి రావిపాటి, వాణి కన్నెగంటి నిర్మాతలు. మైత్రీ మూవీమేకర్స్ సంస్థ ద్వారా జులై 7న సినిమా రిలీజ్ కానుంది. గురువారం ట్రైలర్‌‌‌‌ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. అతిథిగా హాజరైన హరీష్​ శంకర్ మాట్లాడుతూ ‘ట్రైలర్ చూస్తుంటే భారీ సినిమాలకి ఉన్న వీఎఫ్ఎక్స్ కనిపించాయి. టైం ట్రావెల్ కాన్సెప్ట్ చాలా చాలా ఇంటరెస్టింగ్‌‌గాఉంది.

సౌండ్, విజువల్స్ బాగున్నాయి. కచ్చితంగా థియేటర్స్‌‌లో చూడాల్సిన సినిమా’ అని అన్నారు. చైతు మాదాల మాట్లాడుతూ ‘ఒక టౌన్, రెండు గ్రహాలు, మూడు కాలాలు.. ఇది కాన్సెప్ట్. వీటిని ఎలా కనెక్ట్ చేశామనేది సినిమా చూస్తున్నపుడు చాలా ఆసక్తికరంగా ఉంటుంది’ అని చెప్పాడు. ఈ ప్రయాణంలో ఎంతో నేర్చుకున్నా అన్నాడు సాహస్. నిర్మాత వై రవిశంకర్, ఆర్పీ పట్నాయక్ సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు.