ఎమ్మెల్యే పాయల్ శంకర్ బర్త్డే.. 720 మంది రక్తదానం

ఎమ్మెల్యే పాయల్ శంకర్ బర్త్డే.. 720 మంది రక్తదానం

ఆదిలాబాద్ ​టౌన్, వెలుగు: ఆదిలాబాద్ ​ఎమ్మెల్యే పాయల్​ శంకర్ బర్త్​డే వేడుకలను పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సోమవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్​ కేక్ కట్​చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభిమానులు, కార్యకర్తలు 720 మంది రక్తదానం చేసి తమ అభిమానాన్ని చాటుకు న్నారు. ఎమ్మెల్యే కుటుంబంతో కలిసి తిరుపతి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.