ఎప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో 72,401 మంది స్లాట్ బుకింగ్..ఇవాళ (జూన్ 22)నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్

ఎప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో 72,401 మంది స్లాట్ బుకింగ్..ఇవాళ (జూన్ 22)నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్

హైదరాబాద్, వెలుగు: టీజీ ఏప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సెట్ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. కౌన్సెలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా ఆదివారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 72,401 మంది విద్యార్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం స్లాట్లు బుక్ చేసుకున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఎప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సెట్ అడ్మిషన్ల కన్వీనర్ ఏ. శ్రీదేవసేన ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. విద్యార్థులు తమకు ఇష్టమైన కాలేజీలు, కోర్సుల్లో సీటు పొందేందుకు వీలైనన్ని ఎక్కువ వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని కమిషనర్ సూచించారు. 

సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసుకున్న వారికి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు ఎక్కువ సమయం దొరుకుతుందని చెప్పారు. ఈ నెల 28 వరకూ రిజిస్ర్టేషన్లు, ఫీజు చెల్లింపు ప్రక్రియకు అవకాశం ఉందని, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 29 వరకూ కొనసాగనున్నది. వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఈనెల 25 నుంచి జులై 1 వరకూ కొనసాగనుందని పేర్కొన్నారు. అభ్యర్థులు, పేరెంట్స్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాలని కోరారు.