హైదరాబాద్: గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 74 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 60 మంది రాష్ట్రానికి చెందిన వారు కాగా.. మిగిలిన 14 మంది వలస కార్మికులు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,499కి చేరింది. శనివారం ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 41 కేసులు నమోదు అయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 5, మహబూబ్‌నగర్, జగిత్యాలలో 2 చోప్పున, సంగారెడ్డి, నిజామాబాద్, నాగర్‌కర్నూల్, మేడ్చల్, వికారాబాద్, వరంగల్ అర్బన్, వనపర్తి, సూర్యాపేట జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. వలస వచ్చిన వారితో కలిపితే ప్రస్తుతం కరోనా భాదితుల సంఖ్య 2499 మందిగా ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ సోకి చికిత్స తీసుకుని మెరుగుపడి డిశ్చార్జి అయిన వారి సంఖ్య 1412 మంది. కరోనా మహమ్మారితో ఇవాళ మరో ఆరుగురు మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 77కు చేరింది. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 1010 మంది కరోనా చికిత్స తీసుకుంటున్నారు.
