
భారత ప్రభుత్వ సంస్థ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ దేశవ్యాప్తంగా జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్/స్కేల్లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.
అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 04.
పోస్టుల సంఖ్య:
750 (జేఎంజీఎస్–1లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్) తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 50 పోస్టులు ఉన్నాయి.( జనరల్ 22, ఈడబ్ల్యూఎస్ 7, ఓబీసీ 4, ఎస్సీ 2, ఎస్టీ 1)
ఎలిజిబిలిటీ:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత. ప్రభుత్వరంగ బ్యాంక్ లేదా రీజనల్ రూరల్ బ్యాంకుల్లో కనీసం 18 నెలలు అంతకంటే ఎక్కువ కాలం పని చేసిన అనుభవం ఉండాలి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్, కో–ఆపరేటివ్ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్, పేమెంట్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో పని చేసిన వారు అర్హులు కాదు.
వయోపరిమితి:
కనిష్ట వయోపరిమితి 20 ఏండ్లు. గరిష్ట వయోపరిమితి 30 ఏండ్లు. లేదా 1995, ఆగస్టు 2 నాటి కంటే ముందు, 2005, ఆగస్టు 1 తేదీ తర్వాత జన్మించిన వారై ఉండరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీడబ్ల్యూబీడీలకు 10 ఏండ్లు, ఎక్స్ సర్వీస్‌మెన్ ఐదేండ్లు, 1984 అల్లర్ల బాధిత కుటుంబాలకు ఐదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్లు ప్రారంభం: ఆగస్టు 20.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 04.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.850. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.100.
రాత పరీక్ష తేదీ: 2025, అక్టోబర్.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, స్క్రీనింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ, స్థానిక భాషా ప్రావీణ్య పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు punjabandsindbank.co.in వెబ్సైట్లో సంప్రదించగలరు.
ఎగ్జామ్ ప్యాటర్న్
ఆన్లైన్ టెస్టులో మల్టిపుల్ చాయిస్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. సెక్షన్–1లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు 30 మార్కులకు, సెక్షన్–2లో బ్యాంకింగ్ నాలెడ్జ్ 40 ప్రశ్నలు 40 మార్కులకు, సెక్షన్–3లో జనరల్ అవేర్నెస్/ ఎకానమీ 30 ప్రశ్నలు 30 మార్కులకు, సెక్షన్–4లో కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 20 ప్రశ్నలు 20 మార్కులకు ఉంటుంది. అభ్యర్థులు ప్రతి సెక్షన్‌లోనూ క్వాలిఫై కావాల్సి ఉంటుంది. కనీస అర్హత మార్కులు 40 శాతం(జనరల్, ఈడబ్ల్యూఎస్), ఇతరులకు 35 శాతంగా నిర్ణయించారు. ఆన్లైన్ టెస్టులో క్వాలిఫై అయిన అభ్యర్థులను పర్సనల్ ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూకు 50 మార్కులకు కేటాయించారు.
ఫైనల్ సెలెక్షన్
అభ్యర్థులు ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ రెండింటిలోనూ క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఆన్లైన్ టెస్టుకు 70 శాతం వెయిటేజీ, పర్సనల్ ఇంటర్వ్యూకు 30 శాతం వెయిటేజీ ఉంటుంది. రాత పరీక్షలో(120 మార్కులు) వచ్చిన మార్కులను 70 మార్కులుగా, ఇంటర్వ్యూ స్కోర్లను(50) 30 మార్కులుగా మారుస్తారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ రెండింటిలోనూ(100) మార్కులను కలిపి రాష్ట్రాల వారీగా తుది మెరిట్ జాబితాను ప్రకటిస్తారు.
స్థానిక భాషా ప్రావీణ్య పరీక్ష
అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న రాష్ట్ర స్థానిక భాషలో ప్రావీణ్యంపై పరీక్ష ఉంటుంది. అంటే స్థానిక భాషలో చదవడం, రాయడం, అర్థం చేసుకోగలిగే సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూతోపాటే స్థానిక భాషా ప్రావీణ్య పరీక్ష నిర్వహిస్తారు. ఇది కేవలం క్వాలిఫై ఎగ్జామ్ మాత్రమే. అయితే, ఈ ఎగ్జామ్‌లో ఫెయిల్ అయిన అభ్యర్థులను అనర్హులుగా ప్రకటిస్తారు. పదోతరగతి లేదా ఇంటర్మీడియట్ స్థాయిలో స్థానిక భాషను అభ్యసించి ఉంటే స్థానిక భాషా ప్రావీణ్య టెస్ట్ రాయాల్సిన అవసరం లేదు.