ఏపీలో 761 ఉద్యోగాలు.. మార్చి 19న  ఇంటర్వ్యూలు...

ఏపీలో 761 ఉద్యోగాలు.. మార్చి 19న  ఇంటర్వ్యూలు...

ఏపీ నిరుద్యోగులకు మరో శుభవార్త అందింది. 761 ఉద్యోగాలకుగానూ మార్చి 19న కాకినాడలోని పీ.ఆర్. కాలేజీలో ఉదయం 9 గంటలనుంచి జాబ్ మేళా నిర్వహించనున్నారు. పది నుంచి పీజీ వరకూ అర్హతలు, శాఖలను బట్టి జీతభత్యాలు చెల్లించనున్నారు.

 ఏపీ నిరుద్యోగులకు మరో శుభవార్త అందింది. ఇటీవలే జగన్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నేపథ్యంలో వరుస నోటిఫికేషన్లు రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. కాగా ప్రైవేట్ కంపెనీలు సైతం తమ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే ‘డిపార్ట్ మెంట్ ఆఫ్ స్కిల్ డెవలప్ మెంట్ అండ్ ట్రైనింగ్’ సంస్థ ఆధ్వర్యంలో మరో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటన వెలువడింది. 

ALSO READ :- SSMB29: గచ్చిబౌలిలో.. రాజమౌళి, మహేష్ మూవీ షూటింగ్

 761 ఉద్యోగాలకు సంబంధించి మార్చి 19న కాకినాడ పట్టణంలోని పీ.ఆర్. గవర్నమెంట్ కాలేజీలో ఉదయం 9 గంటలనుంచి ఈ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు సంబంధిత అధికారులు  తెలిపారు.   ఇందులో డిమార్ట్ 50, ముత్తూట్ ఫైనాన్స్ 30, అరబిందో 50, వరుణ్‌ మోటర్స్ 12, అపోలో ఫార్మసీ 25, టాటా ఎలక్ట్రాన్సి క్స్ 100, ఆస్ట్రో టెక్ 100, హెచ్1 హెచ్ ఆర్ సోల్యూషన్స్ లో 150తోపాటు తదితర కంపెనీల్లో వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 761 ఉద్యోగ అవకాశాల కల్పించనున్నట్లు తెలిపారు.

పది నుంచి పీజీ వరకూ..

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మంగళవారం  ( మార్చి 19) ఉదయం 9 గంటల వరకూ ఉద్యోగ మేళలకు హాజరు కావాలని సూచించారు. విద్యా అర్హత, పోస్ట్ ను అనుసరించి జీత భత్యాలుంటాయని స్పష్టం చేశారు. ఇందులో పది నుంచి పీజీ వరకూ చదివిన అభ్యర్థులకు అవకాశం కల్పించారు.