బాసర ఆలయానికి... రూ. 77.77 లక్షల ఆదాయం

బాసర ఆలయానికి... రూ. 77.77 లక్షల ఆదాయం

బాసర, వెలుగు: ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన నిర్మల్ జిల్లాలోని బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి హుండీని  మంగళ వారం ఆలయ అధికారులు లెక్కించారు. రూ. 77,77 ,746 నగదు, 126 గ్రాముల బంగారం, 3.440 కిలోల వెండి , 17 విదేశీ కరెన్సీ నోట్లను భక్తులు సమర్పించినట్టు ఆలయ ఇన్ చార్జ్ ఈవో  సుధాకర్ రెడ్డి తెలిపారు. 60 రోజుల తర్వాత హుండీని లెక్కించినట్టు పేర్కొన్నారు.  

ఆలయ చైర్మన్ శరత్ పాటక్ , ఆదిలాబాద్ జిల్లా దేవాదాయశాఖ ఇన్ స్పెక్టర్, ఆలయ ఏఈఓ సుదర్శన్ గౌడ్, సూపంటెండెంట్ శివరాజ్, ఆలయ సిబ్బంది, పోలీసులు, భక్తులు పాల్గొన్నారు.