రష్యాలో మరోసారి భారీ భూకంపం.. సునామీ వార్నింగ్

రష్యాలో మరోసారి భారీ భూకంపం.. సునామీ వార్నింగ్

రష్యాను భూకంపాలు వణికిస్తున్నాయి. వారం రోజుల క్రితమే 7.4 తీవ్రతతో భూకంపం సంభవించగా.. శుక్రవారం (సెప్టెంబర్ 19) మరోసారి భారీ భూకంపం సంభవించడం భయాందోళనకు గురిచేస్తోంది. 

రిక్టర్ స్కేలుపై 7.8 మాగ్నిట్యూడ్ తో రష్కాను భూకంపం షేక్ చేసింది. తరచుగా సంభవించే రష్యా తీర ప్రాంత కమాచ్కా ద్వీపకల్పంలో మరోసారి ఈ ఎర్త్ క్వేక్ సంభవించింది. దీంతో సునామీ అలర్ట్ జారీ చేశారు అధికారులు. 

భూ ప్రకంపనలకు బిల్డింగ్ లు, ఇళ్లలోని ఫర్నిచర్ షేక్ అవుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. భూమి భారీగా కంపిస్తుండటంతో ఆగి ఉన్న కార్లు, బైకులు కొంత దూరం జరిగినట్లు చెబుతున్నారు. 

పెట్రోపావ్లోవ్స్క్-కమ్చాట్స్కీ క్యాపిటల్ కు 128 కిలోమీటర్ల దూరంలో..  భూకంప కేంద్రం నుంచి10 కిలోమీటర్ల దూరంలో భూకంపం ఏర్పడినట్లు యూఎస్ జియోలజికల్ సర్వే (USGS) పేర్కొంది. దాదాపు 5 ప్రకంపనల తర్వాత రష్యా జియోగ్రాఫికల్ కేంద్రం భూకంప తీవ్రత 7.4 కు పైనే ఉండవచ్చునని అంచనా వేసింది. 

యూఎస్ పసిఫిక్ సునామీ వార్నింగె సెంటర్.. తీరప్రాంతాలలో భారీ ఎత్తున అలలు ఎగసిపడటంతో పాటు సునామీ వచ్చే చాన్స్ ఉందని హెచ్చరించింది. 

ప్రస్తుతం ఎలాంటి డ్యామేజ్ లేదని అధికారులు ప్రకటించారు. కొన్ని ప్రాంతాల్లో భవంతుల పెచ్చులు ఊడినట్లు చెప్పారు. అదే విధంగా ఫర్నిచర్ కొంత మేరకు ధ్వంసమైనట్లు తెలిపారు. అయితే సునామీ హెచ్చరికలతో తీర ప్రాంత ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. 

రష్యాలో ఇదే ప్రాంతం అయిన తూర్పు తీరంలోని కామ్చాట్కా ప్రాంతంలో గత శనివారం (సెప్టెంబర్ 13) భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం 10.37 గంటలకు కామ్చాట్కా ద్వీపకల్పం సమీపంలో రిక్టర్ స్కేల్ పై 7.4 తీవ్రతతో భూకంపం ఏర్పడినట్టు యూఎస్ జియాలజికల్ సర్వే వెల్లడించింది. తీర ప్రాంతానికి 111 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో 39 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఏర్పడినట్టు తెలిపింది.