ఒక్కరోజే 78,512 కేసులు..971 మరణాలు

ఒక్కరోజే 78,512 కేసులు..971 మరణాలు

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు విపరీతంగా పెరుగుతుంది. గత నాలుగు రోజులుగా 75 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే 78,512 కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 36,21,246 కు  చేరింది. మరో 971 మంది చనిపోవడంతో మరణాల సంఖ్య 64,469 కు చేరింది. నిన్నటి వరకు 27,74,802 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 7,81,975 మంది ఇంకా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే  8,46,278 టెస్టులు చేశారు.వీటితో కలిపి దేశంలో  ఆగస్టు 30 నాటికి కరోనా టెస్టుల సంఖ్య 4,23,07,914 కు చేరింది.

see more news

మెట్రోలో ట్రావెల్‌ చేయాలంటే..స్మార్ట్ కార్డు,మాస్క్‌ కంపల్సరీ

దారుణం..మూతికి టేప్​వేసి క్యాండిల్​తో కాల్చిన అమ్మమ్మ

తెలంగాణలో కొత్తగా 1873 కేసులు..9 మంది మృతి