వాహనాలను ఢీకొన్న రైలు..8 మంది మృతి   థాయ్ లాండ్ లో ఘోర ప్రమాదం

వాహనాలను ఢీకొన్న రైలు..8 మంది మృతి   థాయ్ లాండ్ లో ఘోర ప్రమాదం

బ్యాంకాక్: పలు వాహనాలను రైలు ఢీకొనడంతో 8 మంది చనిపోయారు. 25 మంది గాయపడ్డారు. థాయ్ లాండ్  రాజధాని బ్యాంకాక్ లో శనివారం ఈ ఘోర ప్రమాదం జరిగింది. ముందుగా బస్సును ఢీకొన్న రైలు తర్వాత కార్లు, బైకులను ఢీకొట్టింది. దీంతో ఆ వాహనాలకు మంటలు అంటుకుని సమీపంలోని ఇతర వెహికల్స్ కు వ్యాపించాయి. ఎమర్జెన్సీ బృందాలు, పోలీసులు  ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వాహనాల శకలాల్లో ఇరుక్కున్న వారిని బయటకు తీశారు. గాయపడిన వారందరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కొన్ని గంటలు కష్టపడిన తర్వాత మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి కారణం తెలియలేదని, ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.