తనిఖీల్లో 8 లక్షలు పట్టివేత

తనిఖీల్లో 8 లక్షలు పట్టివేత

కాగజ్ నగర్/ఆసిఫాబాద్/జన్నారం,వెలుగు : ఎలక్షన్ ​కోడ్ ​అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. తనిఖీల్లో సోమవారం దాదాపు రూ.8 లక్షలు పట్టుబడ్డాయి. సిర్పూర్ టీ మండలంలోని హడ్కులి అంతరాష్ట్ర చెక్​పోస్ట్ వద్ద రూ.5 లక్షలు నగదు పట్టుకుని సీజ్ చేసినట్లు సిర్పూర్ టీ ఎస్ఐ దీకొండ రమేశ్ తెలిపారు. మహారాష్ట్ర వైపు తీసుకెళ్తుండగా పట్టుకున్నట్లు చెప్పారు.

వాంకిడి టోల్ ప్లాజా వద్ద తనిఖీ చేస్తుండగా ఓ వ్యక్తి బైక్​పై తరలిస్తున్న రూ.లక్షా 11 వేలు, మరో బైకర్​ వద్ద రూ.78 వేల 400 పట్టుకున్నట్లు చెప్పారు. సీజ్ చేసిన నగదును జిల్లా కమిటీకి అప్పగిస్తామన్నారు. జన్నారం మండలం ఇందన్ పెల్లిలోని అంతర్ జిల్లా చెక్ పోస్టు వద్ద రూ.లక్షా 5 వేల 900 నగదు పట్టుకున్నట్లు లక్సెట్టిపేట సీఐ నరేందర్ తెలిపారు. ఓ ఐషర్ వ్యాన్​లో లభించినట్లు చెప్పారు.