8నెలల పాప సహా నలుగురు భారతి సంతతి వ్యక్తుల కిడ్నాప్

8నెలల పాప సహా నలుగురు భారతి సంతతి వ్యక్తుల కిడ్నాప్

అమెరికాలో 8 ఏళ్ల పాపతో పాటు నలుగురు భారత్ కు చెందిన వ్యక్తులు కిడ్నాపయ్యారు. కాలిఫోర్నియాలోని మెర్సిడ్ కౌంటీలో జరిగిన ఈ ఘటనలో ఎనిమిది నెలల పాపతో పాటు ఆమె తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఆయుధాలు చూపించి కిడ్నాప్ చేసినట్టు మెర్సిడ్ కౌంటీలోని అధికారులు తెలిపారు. సౌత్ హైవే 59లోని 800బ్లాక్ లోని వారి వ్యాపార స్థలంలో ఈ కిడ్నాప్ జరిగినట్టు తెలుస్తోంది. అయితే వీరి అపహరణకు గల కారణాలు ఇంకా తెలిసిరాలేదు. కిడ్నాపర్ల నుంచి కూడా ఎలాంటి డిమాండ్లూ అందనట్టు సమాచారం. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఎవరికైనా తెలిస్తే 911కి ఫోన్ చేయాలని పోలీస్ అధికారులు సూచించారు. ఇంతకు ముందు ఇలాంటి తరహా ఘటనే 2019లో జరిగింది. డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ యజమాని కాలిఫోర్నియాలోని తమ ఇంట్లో కిడ్నాప్ చేశారు. అయితే కిడ్నాప్ చేసిన కొన్ని గంటల తర్వాత ఆ వ్యక్తి, అతని స్నేహితురాలు కారులో విగత జీవులుగా కనిపించారు.