ఫాసిస్ట్ సర్కార్ ముందు మోకరిల్లబోం

ఫాసిస్ట్ సర్కార్ ముందు మోకరిల్లబోం

న్యూఢిల్లీ: రాజ్య సభలో వ్యవసాయ బిల్లులు ప్రవేశ పెడుతున్న సమయంలో నిరసనలు తెలిపిన 8 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. ఈ విషయంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. సస్పెన్షన్ వివాదంపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సీరియస్ అయ్యారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆమె దుయ్యబట్టారు. ‘ఇది ఖచ్చితంగా నమ్మలేనిది. రాజ్య సభలో విపక్ష లీడర్లను మౌనంగా ఉంచేందుకు బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. రైతుల ఆసక్తులను కాపాడటానికి ఫైట్ చేస్తున్న ఎంపీల సస్పెన్షన్ ప్రజాస్వామ్య విలువలను గౌరవించని ప్రభుత్వ తీరుకు అద్దం పడుతోంది. ఇలాంటి సర్కార్ ముందు మోకరిల్లబోం. పార్లమెంట్‌‌తోపాటు వీధుల్లోనూ ప్రభుత్వంపై పోరాడి తీరుతాం’ అని మమత పేర్కొన్నారు. నరేంద్ర మోడీ నియంతృత్వంలోకి కూరుకుపోయే ముందే దేశ పౌరులు గొంతెత్తండని చెప్పారు.