ఢిల్లీలో కుప్పకూలిన భవనం

ఢిల్లీలో కుప్పకూలిన భవనం

ఢిల్లీలో నిర్మాణంలో భవనం కుప్పకూలింది. కాశ్మీరీ గేట్ సమీపంలోని నికల్సన్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న భవంతి ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అధికారులు ఎనిమిది మందిని అక్కడ నుంచి రెస్క్యూ చేసి కాపాడారు. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందని పోలీసులు తెలిపారు. భవనం కూలిపోయినట్లు తమకు కాల్ వచ్చిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. వెంటనే స్థానిక పోలీసులు, ఫైర్ సర్వీస్, డిడిఎంఎ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టామన్నారు. ఎనిమిది మందిని కాపాడామన్నారు. అయితే వారంతా భవన నిర్మాణ కార్మికులేనని తెలిపారు.