పాకిస్థాన్ జైలు నుంచి 80 మంది భారతీయ మత్స్యకారులు రిలీజ్

 పాకిస్థాన్ జైలు నుంచి 80 మంది భారతీయ మత్స్యకారులు రిలీజ్

చేపల వేటలో అంతర్జాతీయ సరిహద్దు దాటి అరెస్టయిన 80 మంది భారతీయ జాలర్లను పాకిస్థాన్ ప్రభుత్వం విడుదల చేసింది.  పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోని అట్టారీ-వాఘా సరిహద్దు వద్ద భారత సైన్యం అధికారులు మత్స్యకారులను స్వాగతించారు. విడుదలైన మత్స్యకారులు మాట్లాడుతూ..  చేపల వేటలో పొరపాటున పాకిస్థాన్ సరిహద్దు దాటినట్లు చెప్పారు. పాకిస్తాన్ జైళ్లలో ఉన్న 184 భారతీయ మత్స్యకారులను కూడా విడుదల చేయాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఒక మత్స్యకారుడు మాట్లాడుతూ..  చేపల వేటకు వెళ్లిన తాము అనుకోకుండా సరిహద్దును దాటామని,  పాకిస్తాన్ నావికాదళం వచ్చి మమ్మల్ని అరెస్టు చేసిందని వెల్లడించాడు.   3 సంవత్సరాల, 3 నెలల జైల్లో శిక్ష అనుభవించినట్లుగా తెలిపాడు. తమ  పడవలను విడుదల చేయమని తాను ప్రభుత్వాన్ని కోరతానని, అవి చాలా ఖరీదైనవని , అవే తమకు జీవనాధారమని తెలిపాడు.   వాటిని తిరిగి ఇవ్వాలని, మిగిలిన  మత్స్యకారులను కూడా రిలీజ్ చేయాలని కోరాడు. మత్స్యకారులు అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళుతూ పాకిస్థాన్‌లోకి ప్రవేశించారని పాక్ అధికారులు అరెస్టు చేశారు.