ఒకేసారి 80 మంది విద్యార్థినుల జుట్టు దానం.. ఎందుకో తెలిస్తే..

ఒకేసారి 80 మంది విద్యార్థినుల జుట్టు దానం.. ఎందుకో తెలిస్తే..

అమ్మాయిలకు జుట్టు ఎంత పెద్దగా ఉంటే అంత బాగుంటారు. అందుకే అమ్మాయిలు తమ జుట్టును పెంచుకోవడం కోసం ఎన్నో చిట్కాలు ఫాలో అవుతారు. దువ్వుతున్నప్పుడు కొంచెం జుట్టు ఊడినా చాలా బాధపడిపోతుంటారు. అటువంటిది అమ్మాయిలు తమంతట తాము జుట్టు దానానికి ఒప్పుకోవడమనేది చాలా అరుదు.

కోయంబత్తూర్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీకి చెందిన 80 మంది విద్యార్థినులు తమ జుట్టు దానం చేయడానికి ముందుకొచ్చారు. వీరంతా ఎందుకు జుట్టు దానం చేస్తున్నారో తెలుసా? క్యాన్సర్ బారినపడి జుట్టు కోల్పోయిన ఆడవాళ్ల కోసం తమ జుట్టు ఇవ్వాలని వీరంతా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ జుట్టుతో విగ్స్ తయరుచేసి వారికి ఇవ్వవచ్చనేది వారి ఆలోచన.

క్యాన్సర్ బారినపడిన వారికి ఆర్థికంగా చేయూతనివ్వకపోవచ్చు కానీ.. ఇలా జుట్టు దానం చేయడం వల్ల వారి మొహాల్లో కొంత ఆనందాన్ని చూడవచ్చని ఆ విద్యార్థినులు అంటున్నారు.

‘క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగులకు నా జుట్టును దానం చేయడానికి నేను ఇక్కడకు వచ్చాను. క్యాన్సర్ రోగులకు ఆర్థికంగా మద్దతు ఇవ్వలేం. అప్పుడు వారికి ఎలాగైనా సాయం చేయాలని ఆలోచించినప్పుడు నా మనసులో ఈ ఐడియా వచ్చింది. ఇప్పటివరకు జుట్టు దానం చేయడం కోసం 80 మంది విద్యార్థినులు తమ పేరు నమోదు చేసుకున్నారు. మమ్మల్ని చూసి ఇంకా చాలామంది కూడా తమ పేర్లు నమోదు చేసుకుంటారు. దాదాపు 200 మంది వరకు తమ జుట్టు దానం చేస్తారని నేను భావిస్తున్నాను’ అని వినోదిని అనే విద్యార్థిని తెలిపింది.

ఇక్కడికి వచ్చిన విద్యార్థినులు తమ మెరిసే మరియు మందమైన జుట్టులో కొంత భాగాన్ని విరాళంగా ఇచ్చారు. ఆ జుట్టుతో విగ్స్ తయారుచేసి క్యాన్సర్‌ బారినపడ్డ మహిళా పేషంట్లకు పంపిణీ చేస్తారు.

For More News..

ఇంటింటికీ యాంటీ కరోనా టీం

నిజామాబాద్ ​ఎమ్మెల్సీ రేసులో కవిత

మార్చి 31 వరకు కరోనా సెలవులు

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. హాఫ్ డే స్కూల్స్ తేదీ ఖరారు