రెండు స్కూళ్లలో ఫుడ్ పాయిజన్.. 80 మందికి అస్వస్థత

రెండు స్కూళ్లలో ఫుడ్ పాయిజన్.. 80 మందికి అస్వస్థత

రాష్ట్రంలో ఇవాళ రెండు వేర్వేరు స్కూళ్లలో ఫుడ్ పాయిజన్ అయ్యి.. 80 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆదిలాబాద్ జిల్లాలోని కస్తూర్భా గాంధీ పాఠశాల్లో ఫుడ్ పాయిజన్ అయింది. 50 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురుయ్యారు. స్టూడెంట్స్ ను రిమ్స్ హాస్పిటల్ కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఉదయం టిఫిన్ చేసిన తర్వాత విద్యార్థులకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో వారిని హాస్పటల్ కు తరలించారు. రిమ్స్ లో చికిత్స పొందుతున్న స్టూడెంట్స్ ను కలెక్టర్ సిక్తా పట్నాయక్, డీఈవో ప్రణీత పరామర్శించారు.

అలాగే మహబూబ్ నగర్ జిల్లాలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. అడ్డాకుల మండలం పెద్దమునుగలచేడు ప్రైమరీ స్కూల్ లో ఫుడ్ పాయిజన్ తో 30మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత  స్టూడెంట్స్ కు వాంతులు, విరేచనాలు అయ్యాయి. దాంతో వారిని మహబూబ్ నగర్ జనరల్ హాస్పిటల్ కు తరలించి ట్రీట్మెంట్ అందించారు.

మరిన్ని వార్తల కోసం..

అణు యుద్ధానికి దారి తీయొద్దనే చెర్నోబిల్‌ ఆక్రమణ

ప్రధాని మోడీకి థాంక్స్ చెప్పిన పాక్ యువతి

రేపు రష్యా, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రుల భేటీ