రేపు రష్యా, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రుల భేటీ

రేపు రష్యా, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రుల భేటీ

రష్యా, ఉక్రెయిన్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు పలు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో టర్కీ నెరిపిన రాయబారం విజయవంతంగా ఒక అడుగు ముందుకు పడింది. ఓ వైపు హోరాహోరీగా యుద్దం జరుగుతుండగా.. మరోవైపు రెండు దేశాల విదేశాంగ మంత్రులను శాంతి చర్చలకు కూర్చోబెట్టబోతోంది. రేపు టర్కీలో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులెబా, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ భేటీ అయ్యేందుకు రెండు వైపుల నుంచి అంగీకారం వచ్చింది. దీంతో టర్కీ దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తోంది. ఈ విషయాన్ని రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది.

కాగా, రష్యా దాడులతో ఉక్రెయిన్ ఉక్కిరి బిక్కిరి అవుతుడంటంతో.. డిమాండ్ల విషయంపై జెలెన్ స్కీ కొంచెం వెనక్కి తగ్గారు. రష్యాతో నాటో యుద్ధం చేయదని, ఆ కూటమి సభ్యత్వం కోసం ఇక తాను ప్రెజర్ పెట్టబోనని జెలన్ స్కీ స్పష్టం చేశారు. వివాదాస్పద అంశాలన్నా, రష్యాను ఎదుర్కోవడం అన్నా నాటోకు భయమన్నారు. అందుకే ఉక్రెయిన్ ను తన కూటమిలో నాటో చేర్చుకోవట్లేదని విమర్శలు చేశారు. రష్యా అంటే నాటోకు భయమని అర్థమయ్యిందని.. నాటో కూటమిలో చేరేందుకు ఇక అడగబోనని చెప్పారు. అలాగే శాంతి దిశగా రష్యా పెడుతున్న షరతులపైనా ఆలోచన చేస్తామని స్పష్టంచేశారు.

మరిన్ని వార్తల కోసం..

రష్యా దాడుల్లో యువ నటుడు పాషా లీ కన్నుమూత

వండర్స్‌‌ క్రియేట్‌‌ చేయాలంటే.. ఇలా కూడా చేయొచ్చు

జమ్ముకాశ్మీర్‌లో పేలుడు.. ఒకరు మృతి