ప్రధాని మోడీకి థాంక్స్ చెప్పిన పాక్ యువతి

ప్రధాని మోడీకి  థాంక్స్ చెప్పిన పాక్ యువతి

రష్యా.. ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి సురక్షితంగా తీసుకువస్తున్నారు. ‘ఆపరేషన్ గంగా ’ పేరుతో  భారతీయులను  ఏయిర్ లిఫ్ట్ చేస్తున్నారు. ఉక్రెయిన్ కు సరిహద్దుల్లో ఉన్న దేశాలైన హంగేరీ, రోమేనియా, పోలాండ్, స్లోవేకియా నుంచి భారతీయులను స్వదేశానికి తరలించారు. ఇప్పటి వరకు 70కి పైగా విమానాలు, ఏయిర్ ఫోర్స్ సీ17 విమానాల ద్వారా 18 వేల మందిని భారత్ కు తరలించారు.

ఈ క్రమంలో ఓ పాకిస్థానీ యువతి  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపింది. ఉక్రెయిన్‌లోని యుద్ధ ప్రాంతం నుంచి తనను సురక్షితంగా తరలించినందుకు భారత ప్రధాని మోదీకి, ఉక్రెయిన్ దేశంలోని భారత రాయబార కార్యాలయానికి పాకిస్థానీ యువతి అస్మా షఫీక్ కృతజ్ఞతలు తెలిపింది. ఉక్రెయిన్‌లోని యుద్ధ ప్రాంతం నుంచి అస్మా షఫీక్ ను కైవ్‌లోని భారత రాయబార కార్యాలయం ఉద్యోగులు సురక్షితంగా తరలించారు. చాలా క్లిష్టపరిస్థితుల నుంచి తనకు సహాయం చేసిన భారత రాయబార కార్యాలయానికి, భారత ప్రధాని నరేంద్రమోదీకి పాక్ యువతి అస్మా ధన్యవాదాలు తెలిపింది.

యుద్ధ ప్రాంతం నుంచి ప్రస్తుతం పశ్చిమ ప్రాంతంలో ఉన్నానని.. తాను సేఫ్ గా ఇంటికి చేరుకుంటానని తెలిపింది పాకిస్థాన్ యువతి. ప్రస్తుతం సుమీలో చిక్కున్న భారతీయులను సేఫ్ ప్లేస్ కు తరలిస్తున్నారు.. మొత్తం 12 బస్సుల్లో భారతీయులను తరలిస్తున్నారు.ఆపరేషన్  గంగ కార్యక్రమం ద్వారా ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలిస్తుంది కేంద్రం. ఉక్రెయిన్ లో ఇబ్బందులు పడుతున్న బంగ్లాదేశ్ , నేపాల్  దేశాలకు చెందిన పలువురిని ఆపరేషన్  గంగ ద్వారా తరలిస్తున్నారు. బంగ్లాదేశీయుల్ని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుండటంతో ఆ దేశ ప్రధాని సైతం మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. 9 మంది బంగ్లా దేశీయులను క్షేమంగా తరలించారని ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు బంగ్లాదేశ్  ప్రధాని షేక్  హసీనా.

ఇవి కూడా చదవండి: 

రాజీవ్ గాంధీ హత్య కేసులో కీలక దోషికి బెయిల్

రేపు రష్యా, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రుల భేటీ