అణు యుద్ధానికి దారి తీయొద్దనే చెర్నోబిల్‌ ఆక్రమణ

అణు యుద్ధానికి దారి తీయొద్దనే చెర్నోబిల్‌ ఆక్రమణ

ఉక్రెయిన్ పై రష్యా యుద్దం 14 రోజులగా సాగుతోంది. ఈ భీకర పోరులో ఉక్రెయిన్ లోని కీలక ప్రాంతాలపై పట్టు సాధించామని రష్యా విదేశాంగ శాఖ ప్రకటించింది. చెర్నోబిల్, జపొరోజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్లను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నామని చెప్పింది. ఉక్రెయిన్ అణు యుద్ధానికి దిగే ప్రమాదం ఉండకూడదనే ముందస్తు చర్యల్లో భాగంగా వాటిపై తాము పట్టు సాధించామని స్పష్టం చేసింది. ఉక్రెయిన్ చేతిలో ఈ న్యూక్లియర్ ప్లాంట్స్ ఉంటే అణు దాడులు చేస్తామంటూ బెదిరింపులకు దిగే ప్రమాదం ఉందని పేర్కొంది. కాగా, రష్యా గుప్పిట ఉన్న చెర్నోబిల్ అణు విద్యుత్తు కేంద్రం పర్యవేక్షణపై ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఆందోళన వ్యక్తం చేసింది. చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో ఏర్పాటు చేసిన పర్యవేక్షణ వ్యవస్థ నుంచి డేటా ట్రాన్సిమిషన్ ఆగిపోయినట్లు తెలిపింది.

మరోవైపు.. ఇంటర్నేషనల్ కోర్టులో ఉక్రెయిన్ వేసిన పిటిషన్ పై జరిగే వాదనలకు హాజరుకావొద్దని నిర్ణయించినట్టు రష్యా విదేశాంగశాఖ తెలిపింది. అటు.. తమపై అమెరికా ఆర్థిక యుద్ధం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

మరిన్ని వార్తల కోసం..

ప్రధాని మోడీకి థాంక్స్ చెప్పిన పాక్ యువతి

రాజీవ్ గాంధీ హత్య కేసులో కీలక దోషికి బెయిల్

రేపు రష్యా, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రుల భేటీ