క్రూయిజ్ షిప్లో కరోనా కలకలం..800మందికి పాజిటివ్

క్రూయిజ్ షిప్లో కరోనా కలకలం..800మందికి పాజిటివ్

ఓ క్రూయిజ్ షిప్లో కరోనా కలకలం రేగింది. 4600మంది ప్రయాణిస్తున్న ఈ షిప్లో 800 మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో ఈ షిప్ను ఆస్ట్రేలియాలోని సిడ్నీ తీరంలో నిలిపివేశారు. క్రూయిజ్ నౌకలో వందలాది మంది ప్రయాణికులు కరోనా బారినపడడంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని హొం మంత్రిత్వశాఖ విజ్ఞప్తి చేసింది. 

కార్నీవాల్ ఆస్ట్రేలియా కంపెనీకి చెందిన మెజిస్టిక్ ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్ ప్రయాణికులతో న్యూజిలాండ్ నుంచి బయలుదేరింది. సముద్రంలో సగం దూరం వెళ్లాక భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు క్రూజ్ ఆపరేటర్ కార్నివాల్ ఆస్ట్రేలియా వెల్లడించింది. ప్రస్తుతం వారిని ఐసోలేషన్ లో ఉంచామని..వారికి తగిన సదుపాయాలు కల్పించామని  చెప్పింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. వారం వ్యవధిలోనే 19వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.

2020లో కూడా ఇలాంటి ఘటనే నమోదైంది. రూబీ ప్రిన్సెస్ క్రూజ్ షిప్ లో 914 మంది కరోనా బారిన పడ్డారు. వారిలో 28 మంది మరణించారు. అప్పట్లో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.