డీఎస్సీలో ఉమ్మడి జిల్లాకు 823 పోస్టులు 

డీఎస్సీలో ఉమ్మడి జిల్లాకు 823 పోస్టులు 

కరీంనగర్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం గురువారం రిలీజ్ చేసిన మెగా డీఎస్సీలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 823 టీచర్ పోస్టులను భర్తీ చేయబోతోంది. ఇందులో జగిత్యాల జిల్లాలో అత్యధికంగా 334 పోస్టులు, కరీంనగర్ ‌‌ ‌‌కు 245 పోస్టులు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 151, పెద్దపల్లిలో 93 ఉన్నాయి. కేటాగిరీల వారీగా చూస్తే కరీంనగర్ లో స్కూల్ అసిస్టెంట్ (ఎస్ ‌‌ఏ) 86, లాంగ్వేజ్ పండిట్ 18, ఫిజికల్ ఎడ్యుకేషన్ 7, ఎస్జీటీ 114, స్కూల్ అసిస్టెంట్(స్పెషల్ ఎడ్యుకేటర్స్)

5, ఎస్జీటీ(స్పెషల్ ఎడ్యుకేటర్స్) 15 పోస్టులు ఉన్నాయి. జగిత్యాల జిల్లాలో ఎస్ ‌‌ఏ పోస్టులు 99 లాంగ్వేజ్ పండిట్ 39, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ 8, ఎస్జీటీ 161, స్కూల్ అసిస్టెంట్(స్పెషల్ ఎడ్యుకేటర్స్) 5, ఎస్జీటీ(స్పెషల్ ఎడ్యుకేటర్స్) 22 పోస్టులు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎస్ఏలు 56, లాంగ్వేజ్ పండిట్ 12, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ 4, ఎస్జీటీ 67, స్కూల్ అసిస్టెంట్(స్పెషల్ ఎడ్యుకేటర్స్) 3, ఎస్జీటీ(స్పెషల్ ఎడ్యుకేటర్స్) 9 పోస్టులు

 పెద్దపల్లి జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 49, లాంగ్వేజ్ పండిట్ 5, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ 1, ఎస్జీటీ 21, స్కూల్ అసిస్టెంట్(స్పెషల్ ఎడ్యుకేటర్స్) 5, ఎస్జీటీ(స్పెషల్ ఎడ్యుకేటర్స్) 12 పోస్టులు ఉన్నాయి.