
ఓ ఫేమస్ రెస్టారెంట్‌లో కుజిమండి అనే స్పెషల్ వంటకం తిని 85 మంది హాస్పిటల్ పాలు అయ్యారు. కేరళలోని కొడంగల్లూర్‌లోని పెరింజనంలోని హోటల్ లో ఆదివారం (మే26) కుజిమండి తిన్నవారికి వాంతులు, విరేచనాల పాలయ్యారు. నేరుగా హోటల్ కు వెళ్లి తిన్నవారే కాకుండా పార్సల్ తెచ్చుకొని మండి తిన్న వారికి కూడా ఇలా జరిగింది.
వెంటనే వారిని కొడంగలేరు, ఇరింజలకుడలోని హాస్పిటల్ లో చేర్పించారు. కుజిమండి మెరైన్ చేసిన మాంసంతో బంకమంట్టి గొయ్యిలో సన్నని మంటపై ఉడికిస్తారు. బియ్యం, మాంసం కేరళ వెర్షన్ లో వండుతారు. హెల్త్ మినిస్టరీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు, పంచాయితీ రాజ్ అధికారులు పోలీసులతో పాటు కలిసి రెస్టారెంట్ ను తనిఖీ చేశారు. హోటల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారుల తెలిపారు.