సింగపూర్ పార్లమెంటులో భారత సంతతి వ్యక్తులు..ఇద్దరిని నామినేట్ చేసిన ఆ దేశ అధ్యక్షుడు షణ్ముగరత్నం

సింగపూర్ పార్లమెంటులో భారత సంతతి వ్యక్తులు..ఇద్దరిని నామినేట్ చేసిన ఆ దేశ అధ్యక్షుడు షణ్ముగరత్నం

సింగపూర్‌‌‌‌‌‌‌‌: భారత సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులు సింగపూర్‌‌‌‌‌‌‌‌ పార్లమెంట్​కు నామినేట్​అయ్యారు. నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ (ఎన్‌‌‌‌‌‌‌‌ఎమ్‌‌‌‌‌‌‌‌పీలు)గా మొత్తం 9 మందిని సింగపూర్‌‌‌‌‌‌‌‌ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నం ప్రతిపాదించారు. ఇందులో భారత సంతతికి చెందిన నేషనల్ యూనివర్సిటీ పాలీక్లినిక్స్‌‌‌‌‌‌‌‌లో ఫ్యామిలీ ఫిజిషియన్ డాక్టర్ హరేష్ సింగరాజు, అమల్గమేటెడ్ యూనియన్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయీస్ జనరల్ సెక్రటరీ సంజీవ్ కుమార్ తివారీ ఉన్నారు. శుక్రవారం పార్లమెంటు క్లర్క్ కార్యాలయం వీరి పేర్లను విడుదల చేసింది. ఈ నెలలో జరిగే  పార్లమెంటు సమావేశాలలో వీరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.