రాముడికే జీవితం అంకితం.. 30 ఏళ్లుగా అయోధ్య రామాలయం కోసం మౌనవ్రతం

రాముడికే జీవితం అంకితం..  30 ఏళ్లుగా అయోధ్య రామాలయం కోసం మౌనవ్రతం

పై ఫోటోలో కనిపిస్తున్న ఈమె పేరు సరస్వతివేదేవి అగర్వాల్..  వయసు 80 సంవత్సరాలు. జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌ పరిధిలోని కరమ్‌తాండ్‌లో నివాసం ఉంటుంది.  .30 సంవత్సరాల నుంచి ఎవరితోనూ మాట్లాడకుండా ఉండిపోయింది కారణం..  అయోధ్యలో రామమందిరం  నిర్మించే వరకు ఇలాగే ఉండిపోవాలని కఠోర నిర్ణయం తీసుకుంది. ఆమె శపథానికి రాముడి కదిలాడు. జనవరి 22న అయోధ్యలో శ్రీరాముడి  ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. అదే రోజున సరస్వతివేదేవి తన 30 ఏళ్ల మౌన వ్రతాన్ని   రామ్ సీతారాం అంటూ విరమించనుంది. 

 శ్రీరాముడికే తన జీవితాన్ని అంకితం చేసిన సరస్వతివేదేవి ఇక నుంచి అయోధ్యలోనే ఉండనుంది.  మహంత్ నృత్య గోపాల్ దాస్ ఆశ్రమంలో ఆమె ఉండాలని అనుకుంటున్నారు.  అయోధ్యలో జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనేందుకు సరస్వతివేదేవికి ఆహ్వానం అందింది. దీంతో  ఆమె సోదరులు ఇప్పటికే అయోధ్యకు తీసుకువచ్చారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర అధిపతి మహంత్ నృత్య గోపాల్ దాస్ శిష్యులు మనీష్ దాస్, శశి దాస్ సరస్వతి తదితరులు ఆమెను అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్‌లో స్వాగతించారు. 

సరస్వతీ దేవి  1992 మేలో మొదటిసారి అయోధ్యకు వెళ్లారు. అక్కడ ఆమె రామజన్మభూమి ట్రస్ట్ అధినేత మహంత్ నృత్య గోపాల్ దాస్‌ను కలిశారు. ఆయన స్ఫూర్తితో మౌన వ్రతం మొదలుపెట్టారు.  రామాలయ నిర్మాణం పూర్తయ్యాక మౌన వ్రతం వీడాలని ఆమె నిశ్చయించుకున్నారు. సరస్వతీ దేవి చాలా పుణ్యక్షేత్రాలలో నివసిస్తుంది. ఆమె ఎప్పుడూ మౌనంగానే ఉంటుంది. ఏదైనా చెప్పాలంటే ఆమె పెన్ను మరియు కాపీ సహాయం తీసుకుంటుంది. ఇంట్లో తన కుటుంబ సభ్యులతో కేవలం హావభావాలతో మాట్లాడుతుంది.