ఎస్‌బీఐలో 8500 ఖాళీలు

ఎస్‌బీఐలో 8500 ఖాళీలు

ముంబ‌యి ప్రధాన కేంద్రంగా ఉన్న భార‌త ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అప్రెంటిస్ ఖాళీల భ‌ర్తీకి అప్లికేషన్లు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్​ 20 నుంచి డిసెంబర్​ 10 వరకు అప్లైచేసుకోవచ్చు.

ఖాళీలు: 8500

తెలంగాణ: 460(ఆదిలాబాద్​–10, భద్రాద్రి కొత్త గూడెం–21, జగిత్యాల–9, జనగామ–10, జయశంకర్​  భూపాలపల్లి–12, జోగులాంబ గద్వాల–9, కామారెడ్డి–16, కరీంనగర్​–14, ఖమ్మం–24, కుమ్రంభీం ఆసిఫాబాద్​–7, మహబూబాబాద్​–12, మహబూబ్​నగర్​–33, మేడ్చల్​ మల్కాజిగిరి–5, మంచిర్యాల–8, మెదక్​–14, నాగర్​కర్నూల్​–15, నల్గొండ–22, నిర్మల్​–11, నిజామాబాద్​–39, పెద్దపల్లి–10, రంగారెడ్డి–22, సంగారెడ్డి–20, సిద్దిపేట–17, రాజన్న సిరిసిల్ల–6, సూర్యాపేట–28, వికారాబాద్​–23, వనపర్తి–12, వరంగల్​–4, వరంగల్​ రూరల్​–11, యాదాద్రి భువనగిరి–16) ఆంధ్రప్రదేశ్​: 620

సెలెక్షన్​ ప్రాసెస్​: ఆన్‌లైన్ రాత ప‌రీక్ష

ఆన్​లైన్​ రాత పరీక్ష 100 మార్కులకు నిర్వహిస్తారు. ఎగ్జామ్​ డ్యూరేషన్​ 60 నిమిషాలు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి వన్​ ఫోర్త్​ మార్క్​ కోత విధిస్తారు. పరీక్ష ఇంగ్లిష్​, హిందీ రెండు భాషల్లో ఉంటుంది. అభ్యర్థులు బ్యాంక్​ కేటాయించిన కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది.

ఎగ్జామ్​ సెంటర్స్​: తెలంగాణలో హైదరాబాద్​, కరీంనగర్​, ఖమ్మం, వరంగల్​.

లోకల్​ లాంగ్వేజ్​ టెస్ట్​

రాష్ట్రాల వారీగా నోటిఫికేషన్​లో అభ్యర్థులు ఎంచుకున్న లోకల్​ లాంగ్వేజ్ ను టెస్ట్​ చేస్తారు. చదవడం, రాయడం, మాట్లాడటం మూడు భాషా నైపుణ్యాలు పరీక్షస్తారు. అయితే ఆన్​లైన్​ రాత పరీక్షలో అర్హత మార్కులు సాధించిన వారికే ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఫైనల్​గా ఎంపికైన అభ్యర్థులకు మెడికల్​ ఫిట్​నెస్​ చూస్తారు.​

అర్హత‌: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణత‌.
వ‌య‌సు: అక్టోబ‌రు 31, 2020 నాటికి 28 ఏళ్లు మించ‌కూడ‌దు.
అప్రెంటిస్​ డ్యూరేషన్​: 3 ఏళ్లు
స్టైఫండ్​: మొదటి ఏడాది నెలకు  రూ.15000, రెండో ఏడాది రూ. 16,500, మూడో ఏడాది రూ.19000
ద‌ర‌ఖాస్తులు: ఆన్‌లైన్‌లో..
ఫీజు: జనరల్​ అభ్యర్థులకు రూ.300, ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులకు ఫీజు లేదు
హాల్‌టికెట్లకు: డిసెంబ‌రు, 2020 చివ‌రి వారం
ఎగ్జామ్​ తేది: జ‌న‌వ‌రి 2021
ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: 20 నవంబర్​ 2020
చివ‌రి తేది: 10 డిసెంబర్​ 2020
వెబ్​సైట్: ncdcindia.org/apprenticeship