దేశ వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు : వ‌ర‌ద‌లు దాటికి 11 రాష్ట్రంలో 868 మంది దుర్మ‌ర‌ణం

దేశ వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు : వ‌ర‌ద‌లు దాటికి  11 రాష్ట్రంలో 868 మంది దుర్మ‌ర‌ణం

దేశ వ్యాప్తంగా నాలుగు నెల‌ల వ‌ర్షాకాల సీజ‌న్ లో ఆగ‌స్ట్ 11 నుంచి 14వ‌ర‌కు అత్య‌ధికంగా 103% వర్షపాతం న‌మోదైంది. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న ప‌లురాష్ట్రాలు కుండ‌పోత‌ వ‌ర్షాలు ప‌డ్డాయి. వ‌ర్షాల దాటికి భారీ ఎత్తున ఆస్తిన‌ష్టం, ప్రాణ‌న‌ష్టం సంభ‌వించింది.

జూలైలో బీహార్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయాల‌లో కురిసిన భారీ వ‌ర్షాలు వరదలకు కారణమ‌య్యాయి. ఆగస్టు మొదటి వారంలో ముంబై, కొంకణ్ మరియు కర్ణాటక, మరియు ఆగస్టు 15 న రాజస్థాన్ లోని కొన్ని ప్రాంతాల్లో వ‌ర‌దలు సంభ‌వించాయి.

ఆగ‌స్ట్ నెల‌లో కేరళ ఇడుక్కిలో అనూహ్యంగా కురిసిన భారీ వ‌ర్షం కార‌ణంగా కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 55 మంది మరణించిన‌ట్లు గృహ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది.

ఆగస్టు 12 నాటి వరదల‌పై కేంద్రం ఇచ్చిన నివేదిక‌ల ప్ర‌కారం 11 రాష్ట్రాల్లో 868 మంది ప్రాణాలు కోల్పోయారు. గతేడాది వ‌ర్షా కాలంలో 908 మంది మ‌ర‌ణించినట్లు కేంద్రం తెలిపింది.