తెలంగాణలో 9 మంది ఐపీఎస్​లు బదిలీ

తెలంగాణలో 9 మంది ఐపీఎస్​లు బదిలీ
  • సిటీ జాయింట్ సీపీగా ఏవీ రంగనాథ్  
  • సిద్దిపేట సీపీ, మెదక్ ఎస్పీ సిటీకి ట్రాన్స్ ఫర్

హైదరాబాద్, వెలుగు: ఐఏఎస్​లతో పాటు ఐపీఎస్ లనూ రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. 9 మందిని ట్రాన్స్ ఫర్ చేస్తూ సీఎస్ శాంతికుమారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల సమయంలో వరంగల్ మాజీ సీపీ ఏవీ రంగనాథ్​పై ఈసీ బదిలీ వేటు చేయగా.. ఇప్పుడాయనను హైదరాబాద్ సిటీ జాయింట్ సీపీ (క్రైమ్స్ అండ్ సిట్)గా నియమించారు. స్పెషల్ బ్రాంచ్ అడిషనల్ సీపీ పి.విశ్వప్రసాద్ ను సిటీ ట్రాఫిక్ సీపీగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డెవిస్ కు బాధ్యతలు అప్పగించారు. 

ఇంటెలిజెన్స్ ఎస్పీగా ఉన్న ఎస్ఎం విజయ్ కుమార్ ను వెస్ట్ జోన్ డీసీపీగా, మెదక్ ఎస్పీగా ఉన్న రోహిణి ప్రియదర్షిణిని సిటీ నార్త్ జోన్ డీసీపీగా నియమించారు. సిద్దిపేట సీపీ ఎన్.శ్వేతను సిటీ డిటెక్టివ్ డిపార్ట్ మెంట్ డీసీపీగా బదిలీ చేశారు. వెయిటింగ్ లో ఉన్న ఎల్.సుబ్బారాయుడును సిటీ ట్రాఫిక్-–1 డీసీపీగా నియమించారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ నితిక్ పంత్, సిటీ జాయింట్ సీపీ (క్రైమ్స్ అండ్ సిట్) గజరావు భూపాల్, నార్త్ జోన్ డీసీపీ చందనాదీప్తిని డీజీపీ ఆఫీస్ లో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. 

మరో ఐదుగురు డీసీపీలు కూడా.. 

మరో ఐదుగురు డీసీపీలను (నాన్ క్యాడర్ ఐపీఎస్ లు) ట్రాన్స్ ఫర్ చేస్తూ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జితేందర్ ఉత్తర్వులు ఇచ్చారు. వెయిటింగ్ లో ఉన్న ఎన్.వెంకటేశ్వర్లుకు సిటీ ట్రాఫిక్–-III డీసీపీగా పోస్టింగ్ ఇచ్చారు. అక్కడ పని చేస్తున్న డి.శ్రీనివాస్ ను డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. రాచకొండ విమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీగా ఉన్న శ్రీబాల దేవిని సిటీ టాస్క్ ఫోర్స్ డీసీపీగా బదిలీ చేశారు. మాదాపూర్ డీసీపీగా ఉన్న గోనె సందీప్ ను రైల్వేస్ ఎస్పీ(అడ్మిన్)గా బదిలీ చేశారు. అక్కడ పని చేస్తున్న జె.రాఘవేందర్ రెడ్డిని డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు.