బెంగాల్ రైలు ప్రమాదం: తొమ్మిదికి చేరిన మృతులు

బెంగాల్ రైలు ప్రమాదం: తొమ్మిదికి చేరిన మృతులు

బెంగాల్ రైలు ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది. 36 మందిని రెస్క్యూ చేశారు. వారిని హాస్పిటల్ కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. బెంగాల్ లోని జల్పాయ్ గుడి జిల్లా డమోహనీ దగ్గర గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో బికనేర్–గౌహతి ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. మొత్తం 12 భోగీలు ప్రమాదానికి గురయ్యాయి. యాక్సిడెంట్ స్పాట్ ను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పరిశీలించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని మంత్రి తెలిపారు. ఇక్కడి పరిస్థితుల గురించి ప్రధాని మోడీ తమతో నిరంతరం టచ్ లో ఉంటూ తెలుసుకుంటున్నారని చెప్పారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరారు.

ప్రమాదం నుంచి బయటపడిన ప్రయాణికులను స్పెషల్ ట్రెయిన్ లో గౌహతికి పంపించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రైల్వే శాఖ రూ.5 లక్షలు పరిహారం ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.1 లక్ష, స్వల్ప గాయాలైన వారికి రూ.25 వేలు అందిస్తామని తెలిపింది.

మరిన్ని వార్తల కోసం: 

వడ్ల పైసలు రాలేదని దున్నపోతుకు వినతిపత్రం

డోక్లామ్ బార్డర్ దగ్గర్లోనూ రెండు ఊర్లు కట్టిన చైనా

జెట్‌‌ స్పీడులో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’