మణిపూర్‌‌లో 9 మైతీ తీవ్రవాద గ్రూపులపై బ్యాన్

మణిపూర్‌‌లో 9 మైతీ  తీవ్రవాద గ్రూపులపై బ్యాన్

న్యూఢిల్లీ: మణిపూర్‌‌లో 9 మైతీ తీవ్రవాద గ్రూపులు, వాటి అనుబంధ సంస్థలపై కేంద్ర హోం శాఖ నిషేధం విధించింది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ, భద్రతా బలగాలపై దాడులు చేసినందుకు వాటిని ఐదేళ్ల పాటు బ్యాన్ ​చేసినట్టు తెలిపింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ), రివల్యూషనరీ పీపుల్స్ ఫ్రంట్(ఆర్​పీఎఫ్), యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్(యూఎన్ ఎల్ ఎఫ్), మణిపూర్ పీపుల్స్ ఆర్మీ (ఎంపీఏ). 

పీపుల్స్ రివల్యూషనరీ పార్టీ ఆఫ్ కంగ్లీపాక్(పీఆర్ ఈపీఏకే), రెడ్ ఆర్మీ, కంగ్లీపాక్ కమ్యూనిస్ట్ పార్టీ(కేసీపీ), దాని సాయుధ విభాగం రెడ్ ఆర్మీ, కంగ్లీ యాయోల్ కాన్బా లుప్(కేవైకేఎల్), అలయన్స్ ఫర్ సోషలిస్ట్ యూనిటీ కంగ్లీపాక్(ఏఎస్ యూకే) పై నిషేధం విధించినట్టు తెలిపింది. సాయుధ పోరాటం ద్వారా మణిపూర్‌‌ను భారతదేశం నుంచి విడదీయడం, స్వతంత్ర దేశాన్ని స్థాపించడం లాంటి ఆందోళనలకు మణిపూర్‌‌లోని స్థానిక ప్రజలను రెచ్చగొట్టడం మైతీ టెర్రర్​గ్రూపుల లక్ష్యమని హోంశాఖ ప్రకటించింది..

ALSO READ : రిటైల్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ 4.87 శాతం