విదేశాల నుంచి వచ్చిన తొమ్మిది మందికి ఒమిక్రాన్

విదేశాల నుంచి వచ్చిన తొమ్మిది మందికి ఒమిక్రాన్

దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కేరళలో ఇవాళ (బుధవారం) ఒక్క రోజే తొమ్మిది మందికి ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చింది. ‘‘వేర్వేరు దేశాల నుంచి ఎన్నాకుళం వచ్చిన ఆరుగురికి, తిరువనంతపురం వచ్చిన మరో ముగ్గురికి కరోనా వచ్చింది. వాళ్ల శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపగా ఒమిక్రాన్‌ అని తేలింది” అని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 24కు చేరాయని ఆమె చెప్పారు. 

ఎర్నాకుళంలో ఒమిక్రాన్ పాజిటివ్ అని తేలిన వారిలో యూకే నుంచి వచ్చిన ఇద్దరు, టాంజానియా నుంచి వచ్చిన ఒక మహిళ, ఓ బాలుడు, ఘనా, ఐర్లాండ్ దేశాల నుంచి ఒక్కో మహిళ ఉన్నారని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ఇక నైజీరియా నుంచి తిరువనంతపురం వచ్చిన దంపతులకు ఒమిక్రాన్ సోకినట్లు తేలిందన్నారు. ఈ కొత్త కేసులతో దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 222కు చేరినట్లు తెలుస్తోంది.