మెదక్ జిల్లాలో మరోసారి కల్తీ కల్లు కలకలం

మెదక్ జిల్లాలో మరోసారి కల్తీ కల్లు కలకలం

మెదక్ జిల్లాలో కల్తీ కల్లు మరోసారి కలకలం రేపింది. కల్తీ కల్లు తాగి 9 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తూప్రాన్ మండలం వట్టూర్ గ్రామంలో ముగ్గురు, శివంపేట్ మండలం కొంతాన్ పల్లిలో ముగ్గురు,  పోతుల బొగుడలో ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి కల్లు తాగిన తర్వాత నాలుక ఉబ్బిపోయి, కాళ్ళు, చేతులు, మెడలు తిరిగిపోయాయని కుటుంబసభ్యులు చెప్పారు. వెంటనే కొందరిని తూప్రాన్ ఆస్పత్రికి .. మరికొందరిని హైదరాబాద్ తరలించినట్టు చెప్పారు. వీరంతా నిన్న రాత్రి కొంతాన్ పల్లి, వట్టూర్ లో కల్తీ కల్లు తాగారని బంధువులు చెబుతున్నారు.

 

మరిన్ని వార్తల కోసం..

పంజాబ్లో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ