పాతబస్తీ మీరాలం చెరువులో చిక్కుకున్న ..9మంది కార్మికులు సేఫ్

పాతబస్తీ మీరాలం చెరువులో చిక్కుకున్న ..9మంది కార్మికులు సేఫ్

హైదరాబాద్ పాతబస్తీ లోని  మీరాలం చెరువులో  కేబుల్ బ్రిడ్జి పనులకు వెళ్లి చిక్కుకున్న తొమ్మిది మంది కార్మికులను సురక్షితంగా రక్షించారు.ఎసీ డీఆర్ఎఫ్,   హైడ్రా సిబ్బంది రాత్రి నుంచి చెరువులో గాలింపు చర్యలు చేపట్టి తొమ్మిది మందిని సేఫ్ గా కాపాడారు. 

అసలేం జరిగిందంటే..పాతబస్తీలోని మీరాలం చెరువులో కేబుల్ బ్రిడ్జి నిర్మాణ కొలతల కోసం తొమ్మిది మంది కార్మికులు   జనవరి 25న రాత్రి బోటులో వెళ్లారు. వచ్చే సమయంలో బోటు మొరాయించడంతో వారంతా అక్కడే చిక్కుకున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ డీఆర్ఎఫ్  బృందాలు, రంగంలోకి దిగి తొమ్మిది మంది కార్మికులను సేఫ్ గా రక్షించాయి.