దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఢిల్లీలోని కర్తవ్య పథ్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము త్రివర్ణ పతాకం ఎగురు వేశారు. త్రివిధ దళాల సైనిక వందనం స్వీకరించారు. ఈ సారి గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథులుగా యూరోపియన్ యూనియన్ కమిషన్ ప్రసిడెంట్ ఉర్సులా వాన్ డర్ లెయెన్, యూరోపియన్ యూనియర్ కౌన్సిల్ ప్రసిడెంట్ ఆంటోనియో కోస్టా హాజరయ్యారు.. గణతంత్ర వేడుకల్లో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, ప్రముఖులు పాల్గొన్నారు.
మరోవైపు గణతంత్ర వేడుకల్లో భాగంగా నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమర జవాన్లకు ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నివాళులర్పించారు. ఢిల్లీలో గణతంత్ర వేడుకలకు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఢిల్లీ వ్యాప్తంగా 30 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. కేవలం న్యూ ఢిల్లీ జిల్లాలోనే 10 వేల మంది పోలీసులను మోహరించారు. రిపబ్లిక్ డే ఉత్సవాల్లో త్రివిధ దళాల కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎర్ర కోట నుంచి రాష్ట్ర పతిభవన్ వరకు సైనిక కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కవాతులో ఇండోనేషియా సైన్యం కూడా పాల్గొన్నది. కర్తవ్య పథ్ లో గణతంత్ర వేడుకల సంబురాలు అంబరాన్నంటాయి. కర్తవ్య పథ్ కు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు.
మరిన్ని విశేషాలు:
- 17 రాష్ట్రాలు, 13 కేంద్ర పాలిత ప్రాంతాల శకటాల
- కర్తవ్య పథ్ లో వందేమాతరం థీమ్ తో వేడకలు
- 6050 మంది సైనికులతో పరేడ్
- కర్తవ్య పథ్ దగ్గర 30 కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు
- 3 వేల సీసీ టీవీ కెమెరాలతో నిఘా
- అనుమానితులను గుర్తించేందుకు పోలీసులకు ఏఐ కళ్లజోడు
- ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్
- 2 వేల 25 వందల మందితో సాంస్కృతిక కార్యక్రమాలు
