- ప్రభుత్వ సలహాదారుడు పి.సుదర్శన్ రెడ్డి
బోధన్, వెలుగు : ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్య, భోజనం లభిస్తోందని ప్రభుత్వ సలహాదారుడు పి.సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఆదివారం బోధన్పట్ణణంలోని ఫారంలో రూ.22 కోట్లతో నిర్మించిన మైనార్టీ బాలుర గురుకుల రెసిడెన్షియల్ స్కూల్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ విద్యారంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రభుత్వం అందించే సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఐటీఐలను అప్ గ్రేడ్చేసి అడ్వాన్స్ టెక్నికల్ కోర్సులు, స్కీల్డెవలమెంట్ కోర్సులు ప్రవేశపెట్టి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.
టెక్నాలజీని నేర్చుకుంటే మన దేశంలోనే వివిధ రకాలైన వస్తువులు తయారు చేసుకోవచ్చని, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే అవసరం ఉండదన్నారు. గురుకుల స్కూళ్లలోని బాలుర, బాలికలు క్రీడలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహెర్ బీన్ హందాన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్అంతిరెడ్డి రాజారెడ్డి, జిల్లా మైనార్టీ శాఖ సంక్షేమ అధికారి కృష్ణవేణి, బాలికల గురుకుల స్కూల్ ప్రిన్సిపాల్ పద్మజా, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
