ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్‌కు చెందిన బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్లు, నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, టీపీసీసీ ప్రెసిడెంట్‌మహేశ్ కుమార్‌గౌడ్ సమక్షంలో కాంగ్రెస్తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరినవారికి కాంగ్రెస్కండువాలు కప్పి ఆహ్వానించారు. కాంగ్రెస్‌లో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని వారు భరోసా ఇచ్చారు. కాంగ్రెస్‌లో చేరినవారిలో గంగా మోహన్చక్రు, పండిత్ ప్రేమ్ కుమార్, సడాక్ ప్రమోద్, బిజ్జు సంతోష్ కుమార్తదితరులు ఉన్నారు.
