మహాత్మ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శ్రమదానం

మహాత్మ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శ్రమదానం

ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ జడ్పీ హైస్కూల్​లో ఆదివారం మహాత్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రమదానం నిర్వహించారు. స్కూల్ ఆవరణలో పెరిగిన కలుపు మొక్కలను తొలగించారు. వాటర్ ట్యాంకు వద్ద పేరుకుపోయిన చెత్తను తొలగించి శుభ్రం చేశారు. మహాత్మ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సుంకె శ్రీనివాస్, హెచ్​ఎం​ శ్రీనివాస్, టీచర్స్, స్వచ్ఛంద సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.