కేసీఆర్ కు కల్లుతో అభిషేకం చేయాలి

కేసీఆర్ కు కల్లుతో అభిషేకం చేయాలి

బాన్సువాడలో గురువారం బీజేపీ బహిరంగ సభలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అర్వింద్ మాట్లాడుతున్న టైంలో.. ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకున్నాడు ఓ బాలుడు. అతడి పేరు నర్సింహ. సెకండ్ క్లాస్ చదివి మానేశాడు. బహిరంగ సభలో నేతల ప్రసంగాలు జరుగుతుండగా ..దూరం నుంచి చూస్తూ నేతల మాటలకు.. హావ భావాలతో స్పందిస్తూ.. తొడ కొట్టి.. అందరి దృష్జిని ఆకర్షించాడు.

ఈ 9 ఏళ్ల బాలుడి స్పందనను కొద్ది మొబైల్స్ లో వీడియో తీసి షేర్ చేశారు. ఈ వీడియే కాస్తా వైరల్ అయ్యింది. దీనిపై స్పందించిన ఎంపీ అర్వింద్.. ఆ పిల్లోడిని ఇంటికి పిలుచుకునే భోజనం పెట్టాడు. కొత్త బట్టలు కొనిచ్చాడు. నర్సింహను మళ్లీ స్కూల్ లో చేర్పించేందుకు ఎంపీ అర్వింద్ ఏర్పాట్లు చేశారు.

అయితే బాలుడి తల్లి ఓ మానసిక రోగి. తండ్రి పాత సామాన్లు దుకాణం నడుపుతూ ఇంటిని పోషిస్తున్నాడు. తమకు డబుల్ బెడ్ రూం ఇవ్వలేదని..అందుకే కోపంతో కేసీఆర్, పోచారంలను వ్యతిరేకించానని చెప్పాడు. అంతేకాదు సీఎంకు పాలాభిషేకం చేయాలా… కల్లు అభిషేకం చేయ్యాలా అంటే కల్లు అభిషేకం చేయాలి అంటూ సమాధానం ఇచ్చాడు నర్సింహ.