
ఊరికే కోపాలు వచ్చేస్తున్నాయి.. ఊ అన్నా తప్పే.. ఆ అన్నా తప్పే.. పెద్దలు నోరు తెరిస్తే చాలు ఇక మొదలెట్టాశాడు అంటూ నిట్టూర్పులు.. ఈ తరం పిల్లలు ఇదే విధంగా ఉన్నారు. అమ్మానాన్నలు చెప్పింది మంచా చెడా అనేది అస్సలు పాయింట్ కాదు.. మేం చేస్తుంది కరెక్ట్ అనే ఫీలింగ్ లోకి వెళ్లిపోయారు.. వయస్సుతో సంబంధం లేకుండా విపరీతమైన ఇగోలతో ఉంటున్నారు.. ఇగో హర్ట్ అయితే చాలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అసలు విషయం ఏంటంటారా.. తమిళనాడు రాష్ట్రంలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది.. ప్రతి ఇంట్లో ఇదే డిస్కషన్ అయ్యింది...
తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు పట్టణం. కృష్ణమూర్తి అనే తండ్రి.. అతనికి తొమ్మిదేళ్ల కుమార్తె.. ఎంతో చలాకీ.. తన కూతురు అంటే పిచ్చి ప్రేమ కృష్ణమూర్తికి. కుమార్తె వయస్సు తొమ్మిదేళ్లే అయినా.. ఇన్ స్టా రీల్స్ చేస్తూ.. తిరువళ్లూరులోని ఇన్ స్టా క్వీన్ అనే పేరు తెచ్చుకుంది. మొబైల్స్ లో రీల్స్ చేస్తూ అందరికీ దగ్గరైంది. తండ్రి మాత్రం రీల్స్ వద్దూ.. బుద్దిగా చదువుకో అమ్మా అంటూ చెబుతూ వస్తున్నాడు. అప్పుడప్పుడు రీల్స్ చేసుకో.. చదువు ముఖ్యం అని బుద్దిగా చెబుతూ వచ్చాడు.
మార్చి 27వ తేదీ సోమవారం రాత్రి 8 గంటల సమయంలో పక్క ఇంట్లో ఆడుకుంటున్న కుమార్తెను పిలిచి.. ఎగ్జామ్స్ కదా ఇంట్లోకి వచ్చి చదువుకో అని అరిచాడు.ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవటంతో.. కుమార్తెను ఇంట్లోకి పంపించి.. బండిలో పెట్రోల్ కొట్టించుకోవటానికి బయటకు వెళ్లాడు. 15 నిమిషాల తర్వాత రాత్రి 8 గంటల 15 నిమిషాలకు ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటి లోపలి నుంచి తలుపునకు గడి పెట్టి ఉంది. కుమార్తెను పిలిచినా ఎంతకీ పలకలేదు.. దీంతో కిటికీ పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా.. కాటన్ టవల్ తో.. ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఉంది తొమ్మిదేళ్ల కుమార్తె..
చుట్టుపక్కల వారి సాయంతో.. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు తెలిపారు డాక్టర్లు. కన్న కుతూరు.. పిచ్చి ప్రేమ.. చదువుకో అన్నందుకే చచ్చిపోయింది.. ఇన్ స్టా రీల్స్ వద్దమ్మా.. బుద్దిగా చదువుకో అని చెప్పినందుకే చనిపోయింది.. ముందూ వెనకా ఏమీ ఆలోచించలేదు.. అసలు తొమ్మిదేళ్ల వయస్సులో ఆత్మహత్య ఆలోచన ఎలా వచ్చింది.. ఉరేసుకోవాలనే తీవ్ర నిర్ణయం ఎలా వచ్చింది.. సోషల్ మీడియాలో పాటలు పాడుతూ ఎంతో యాక్టివ్ గా ఉంటే చిన్నారికి ఇంత తీవ్ర నిర్ణయం తీసుకోవటం ఏంటీ.. ఇదే ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది.