యాక్సిడెంట్లో చనిపోయా.. ఇప్పుడు మళ్లీ పుట్టా.. అన్నీ నిజమే అవుతున్నాయి..

యాక్సిడెంట్లో చనిపోయా.. ఇప్పుడు మళ్లీ పుట్టా.. అన్నీ నిజమే అవుతున్నాయి..

పునర్జన్మ అనే పదం వినగానే, మనిషికి తన ప్రస్తుత జీవితం మొదటిది అనే భావన స్ఫురిస్తుంది, ఈ జీవనం చాలించిన తరువాత రాబోయే కాలంలోనో, లేక యుగంలోనో మరో జన్మ వుండడం తథ్యం అనే విశ్వాసమే ఈ పునర్జన్మ అనే భావనకు మూలం. అలాగే జీవితంలో అనేక మలుపులు మార్పులు రావడాన్నికూడా మరోజన్మతో పోలుస్తారు. 

కోటి సంవత్సరాల తర్వాత మళ్లీ మనిషి రూపంలో జన్మించే అవకాశం వస్తుందని చెబుతారు. లోకంలో చాలా మంది తమ పూర్వ జన్మలోని విషయాలను స్మరించుకుంటారు. చాలా మందికి పునర్జన్మ విషయాన్ని నమ్మరు. మరికొంత మంది అదృష్టవంతులు మాత్రమే మానవ రూపంలో జన్మిస్తారని నమ్ముతారు.ప్రస్తుతం సోషల్ మీడియా చాలా పునర్జన్మ కథలు వైరల్​ అవుతున్నాయి. 

81 ఏళ్ల తరువాత మళ్లీ మానవరూపంలో..

తాజాగా అమెరికాలో నివాసం ఉంటున్న ఆష్లీ అనే మహిళ ఒక వింత కథనాన్ని వెలుగులోకి తెచ్చారు.  తొమ్మిదేళ్ల  తన బాలిక తనతో ముసలి వాళ్లగా మాట్లాడుతూ గత జన్మ గురించి వివరించిందని ఆమె తెలిపింది.  81 సంవత్సరాల తర్వాత మానవ రూపంలో జన్మించినట్టు తెలిపింది.   ఆష్లీ  కుమార్తె గత జన్మలో  స్త్రీగా పుట్టానని పేర్కొంది. తన మరణానికి సంబంధించిన వివరాలను కూడా తెలిపింది.  

గత జన్మలో  కారు ప్రమాదంలో మరణించా.. 

ఆష్లీ తన పూర్వ జన్మ గురించి తన కుమార్తెను అడిగింది.   తన తల్లి చాలా సంవత్సరాల క్రితం మరణించింది. అతని తండ్రి పేరు శామ్యూల్ అని చెప్పింది. ఆష్లీ కూతురు కూడా  గత జన్మలో తాను ఎలా మ‌ర‌ణించిందో వివరించింది. 1942 లో కారు ప్రమాదంలో మరణించించానని అన్నారు. ఆష్లీ  కుమార్తె చెప్పిన తేదీ ప్రకారం ఆ  ప్రదేశంలో జరిగిన సంఘటనలను విచారించగా..  అది నిజమని తేలింది. ఆ రోజు ఆ స్థలంలో ఒక కారు ప్రమాదం జరిగిందని..  అందులో ఒక మహిళ ,  ఆమె కుమార్తె మరణించారు. ఆష్లీ తన కుమార్తె పూర్వ జన్మ వివరాలను ప్రజలతో పంచుకుంది.

ఐదేళ్ల నుంచి పునర్జన్మ కథలు ..

అష్లీ కూతురు ఐదేళ్ల నుంచి ఇలాంటి కథలు చెప్పేదని...  తన గత జీవితం గురించి మాట్లాడేదని తెలిపారు.  మొదట తన కూతురు సరదాగా కథలు చెబుతోందని భావించానని ఆష్లీ అన్నారు.  ఆ తర్వాత కంటిన్యూగా అలాంటి కథలు చెప్పడంతో ..  తన కూతురి గురించి తెలుసుకోవడానికి  .. ఆష్లీ ఆమెను మూడేళ్లలో రెండుసార్లు ఒకే  ప్రశ్న అడిగింది. ప్రతిసారీ ఒకే  సమాధానం చెప్పడంతో  ఆష్లీ కూతురు అబద్ధం చెప్పడం లేదని నిర్ధారణ అయింది.