ధారావి లో పెరుగుతున్న కరోనా కేసులు…ఆందోళన లో సర్కార్

ధారావి లో పెరుగుతున్న కరోనా కేసులు…ఆందోళన లో సర్కార్

ముంబై : ముంబై లోని స్లమ్ ఏరియా ధారావి లో కరోనా కలకలం రేపుతోంది. ఇక్కడ రోజురోజుకు కేసుల సంఖ్య పెరగటం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంట్లలోనే కొత్తగా 94 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మృతి చెందారు. ధారావిలో ఒక్క రోజు ఇన్ని కేసులు నమోదవటం ఇదే తొలిసారి. దాదాపు 10 లక్షల మంది ఉండే ఈ ప్రాంతంలో ఇరుకు ఇళ్లు ఉంటాయి. ఇక్కో గదిలో పది నుంచి 15 మంది నివాసం ఉంటారు. సరైన నివారణ చర్యలు క్లీన్ నెస్ లేకపోవటంతో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంది. ఇప్పటికే దాదాపు 600 మంది కరోనా బారిన పడగా 20 మంది చనిపోయారు. ఒక్క రోజే 94 కేసులు నమోదు కావటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఇక్కడ ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. సోషల్ డిస్టెన్స్ మెయింటెన్ చేయాలంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పెద్ద ఎత్తున డాక్టర్ల టీమ్ లు, శానిటేషన్ సిబ్బంది ఇక్కడ కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు శ్రమిస్తున్నాయి. పరిస్థితి అదుపు తప్పితే చాలా మంది కరోనా బారిన పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల్లో మహారాష్ట్రనే టాప్ లో ఉంది.