
చెన్నైలో 12 అడుగుల కొండ చిలువ స్థానికులను టెన్షన్ పెట్టింది. అంబూర్ ఫారెస్ట్ నుంచి వచ్చిన కొండచిలువ… మరపట్టి గ్రామంలోని ఓ వ్యవసాయబావిలో జారిపడింది. ఇది గమనించిన స్థానికులు అధికారులకు సమాచారమిచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న అటవీ అధికారులు…. బావినుంచి కొండచిలువను తీసి తిరిగి అడవిలో విడిచిపెట్టారు. ఇప్పటివరకు అంబూర్ ఫారెస్ట్ లో దొరికిన అతిపెద్ద కొండచిలువ ఇదే అని తెలిపారు. పామును భగవంతుడిగా భావిస్తూ స్థానిక మహిళలు కొందరు దానికి పూజలు చేశారు.