
హైదరాబాద్: జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలోని షాపూర్ నగర్ హమలీ అడ్డా వద్ద బుధవారం నాడు 15 అడుగుల ఓ కొండచిలువ ప్రత్యక్షమైంది. జనవాసాల మధ్యలోకి వచ్చిన కొండచిలువను చూసి జనాలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల సమాచారం మేరకు స్నేక్ సోసైటీ సభ్యులు వచ్చి కొండచిలువను పట్టుకుని సంచిలో బంధించి తీసుకెళ్లారు. జనావాసాలలో ప్రత్యక్షమైన కొండచిలువను చూసి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఎవరైనా కావాలనే ఈ పామును ఇక్కడ వదిలివెళ్లారా అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.